Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ గాయాలపాలయ్యాడు. కేడీ అనే కన్నడ సినిమా షూటింగ్లో బాంబ్ పేలడంతో అతడికి గాయాలయ్యాయి. బుధవారం నాడు బెంగుళూరులోని మగడి రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న కేడీ మూవీలో ఫైట్ మాస్టర్ రవి వర్మ ఆధ్వర్యంలో బాంబు బ్లాస్ట్ ఫైట్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా అకస్మాత్తుగా బాంబు పేలడంతో సంజయ్ మోచేయి, ముఖానికి గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స తీసుకున్న అనంతరం ఆయన ముంబై వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు.