Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మణిరత్నం దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంలో వచ్చిన సినిమానే 'పొన్నియిన్ సెల్వన్ 1'. విక్రమ్ .. కార్తి .. జయం రవి .. ఐశ్వర్య రాయ్ .. త్రిష ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, తమిళనాట సంచలన విజయాన్ని నమోదు చేసింది. మిగతా భాషల్లో విజువల్ వండర్ అనిపించుకుంది.
అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా 'పొన్నియిన్ సెల్వన్ 2' రూపొందింది. ఫస్ట్ఈ పార్టు విడుదల సమయానికే సెకండ్ పార్ధుకి సంబంధించిన చాలా భాగం చిత్రీకరణ జరుపుకోవడం వలన, రెండు భాగాల మధ్య గ్యాప్ ఎక్కువగా లేదు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు. ఒక్కో పాటను వదులుతూ వస్తున్నారు.
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి 'శివోహం .. శివోహం' అనే లిరికల్ వీడియోను వదిలారు. ఆదిశంకరుల విరచితమైన 'నిర్వాణ శతకం' లోనిది ఇది. రెహ్మాన్ (రఘు)తో పటు కొంతమంది సాధువులపై చిత్రీకరించారు. ఈ భాగంలో ఆయన పాత్ర ప్రాధాన్యతను ఈ లిరికల్ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.