Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలోని సీవోఈ (సెంటర్ ఆప్ ఎక్సలెన్స్) విద్యాలయాల్లో ఇంటర్లో ప్రవేశాలకు మార్చి 5న పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరైన విషయం తెలిసిందే. ఈ విద్యాలయాల్లో విద్యనభ్యసించేందుకు ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ కల్పించనున్నారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించనున్నారు. మొత్తం 3680 సీట్లు (1680 మంది బాలురుబీ 2000 మంది బాలికలు) ఉన్నాయి.