Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఓపెనర్ జాస్ బట్లర్తోపా దేవధూత్ పడిక్కల్, హిట్మేయర్ రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్‌పై మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫర్వాలేదనిపించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్ విజయ లక్ష్యం 176 పరుగులుగా ఉంది. రాజస్థాన్ బ్యాట్స్‌మెన్స్‌లో జాస్ బట్లర్ మినహా పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. యశశ్వి జైస్వాల్ (10), జాస్ బట్లర్ (52), దేవధూత్ పడిక్కల్ (38), సంజూశాంసన్ (0), రవిచంద్రన్ అశ్విన్ (30), హెట్మేయర్ (30 నాటౌట్), ధ్రువ్ జురెల్ (4), జాసన్ హోల్డర్ (0), ఆడం జంపా (1) చొప్పున పరుగులు చేశారు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. వరుస విరామాల్లో వికెట్లు తీయలేకపోయినప్పటికీ ఒక దశలో కొద్దిమేర పరుగులను నియంత్రించారు. కాగా ఆకాశ్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రవీంద్ర జడేజా తలో 2 వికెట్లు, మొయిన్ అలీ 1 వికెట్ తీశాడు. మరో వికెట్ రనౌట్ రూపంలో దక్కింది.