Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘానికి చైర్మన్, సభ్యులను నియమించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్జీజీ) ఎఫ్జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి బుధవారం గవర్నర్కు లేఖ రాశారు. రాష్ట్రంలో వసూలయ్యే పన్నుల్లో ఎంత వాటా గ్రామ పంచాయతీలకు ఇవ్వాలనేది రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుందని, దీన్ని ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు రాజ్యాంగంలోని 243(ఐ) అధికరణ ప్రకారం రాష్ట్ర గవర్నర్ నియమిస్తుంటారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయకపోవడంతో ఎఫ్జీజీ కోర్టుకు వెళ్లిందని, దీంతో స్పందించిన ప్రభుత్వం మొదటి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ ఆర్థిక సంఘానికి ఒక చైర్మన్, ఒక సభ్యుడిని మాత్రమే నియమించగా వారి పదవీ కాలం పూర్తయిందన్నారు. ప్రస్తుతం ఆర్థిక సంఘానికి చైర్మన్, సభ్యులు లేక పనిచేయడం లేదని, ఈ దృష్ట్యా వెంటనే వారిని నియమించాలని డిమాండ్ చేశారు.