Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్నూలు: మఫ్టీలో వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐతోపాటు కానిస్టేబుల్‌పైనా సారా తయారీదారులు దాడి చేశారు. వారిపై పిడిగుద్దులు కురిపించారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం బుగ్గ తండాలో బుధవారం తెల్లవారుజామున జరిగిందీ ఘటన. పత్తికొండ సెబ్ ఎన్ఫోర్సుమెంట్(స్పెషల్‌పార్టీ) ఎస్ఐ ఓబులేసు ఓ కానిస్టేబుల్‌ను వెంటబెట్టుకొని మఫ్టీలో బుగ్గ తండాలో నాటుసారా తయారీదారులపై దాడులకు వెళ్లారు. దీనిపై స్థానిక సెబ్ అధికారులకుగానీ, పోలీసులకు గానీ ముందుగా సమాచారం ఇవ్వలేదు. తెల్లవారుజామున నాటుసారా బట్టీలను ధ్వంసం చేసేందుకు ఎస్ఐ ప్రయత్నించగా, గుంపుగా ఉన్న తయారీదారులు అడ్డుకున్నారు. తాము ఎన్ఫోర్స్మెంట్ అధికారులమని చెప్పినప్పటికీ పిడిగుద్దులు కురిపించి పారిపోయారు. అనంతరం సెబ్ సిబ్బంది అక్కడికి చేరుకొని 108 అంబులెన్సులో ఎస్ఐని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని దాడికి పాల్పడిన ఏడుగురిని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. వైసీపీ నాయకుడి సహా ఏడుగురిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ గోపాల్ తెలిపారు.