Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: పోటీని అధిగమించడానికి అక్రమ పద్ధతులు అవలంబించిదని గూగుల్‌కు దక్షిణా కొరియా భారీ జరిమానా విధించింది. మొబైల్ యాప్ మార్కెట్లో తనకున్న పలుకుబడిని ఉపయోగించి తమ దేశ ప్లే స్టోర్ వన్ స్టోర్.కో ఎదుగుదలను బ్లాక్ చేసినందుకు రూ.262 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మేరకు కొరియా ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (కేఎఫ్టీసీ) గూగుల్‌కు మంగళవారం ఈ-మెయిల్ పంపింది. కొత్త గేమ్‌లను కేవలం తమ ప్లే స్టోర్‌లోనే విడుదల చేయాలని గూగుల్ కొన్ని కొరియన్ గేమ్ కంపెనీలను అడిగిందని కేఎఫ్టీసీ వెల్లడించింది. ఇది తమ దేశంలోని ఇతర ప్లే స్టోర్ల వ్యాపారాన్ని అక్రమంగా దెబ్బ తీయడమేనని చెప్పింది. అయితే గూగుల్ ఈ ఆరోపణలను ఖండించింది.