Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 230 రోజుల అత్యధికానికి చేరాయి. కొత్తగా 2,29,958 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 10,158 మందికి వైరస్ సోకినట్లు తేలిందని గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముందురోజు కంటే 30 శాతం మేర అధికంగా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 4.42శాతానికి చేరింది. వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 44,998(0.10శాతం)కి చేరాయి. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే.. మన దేశంలో కొవిడ్ ఎండమిక్ దశకు చేరుకుందని బుధవారం అధికార వర్గాలు ప్రకటించాయి. ఈ క్రమంలో మరో 10-12 రోజులపాటు కేసుల ఉద్ధృతి కొనసాగుతుందని.. ఆ తరువాత తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఒమిక్రాన్, దాని ఉపరకమైన ఎక్స్‌బీబీ.1.16 (ఎక్స్‌బీబీ.1.16 సబ్‌వేరియంట్) కారణంగా కేసుల పెరుగుదల వేగంగా ఉన్నప్పటికీ.. వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నాయి.