Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వరుస హిట్లతో దూసుకుపోతున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబులో సామాజిక సేవా గుణం కూడా ఎక్కువే. తొలి నుంచి కూడా తన తండ్రి మాదిరిగానే తన సంపాదనలో కొంత సమాజసేవకు ఖర్చు చేయడం మహేశ్ బాబుకు అలవాటు. తన మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు ఆయన గుండె శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారు. చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు.
తాజాగా రెండేళ్ల వయసు గల చిన్నారి శివాలికి మహేశ్ బాబు ఫౌండేషన్ తరపున గుండెకు శస్త్ర చికిత్సను నిర్వహించారు. ఈ ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆ చిన్నారి సంతోషంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, ఇంటికి చేరుకుంది. ఈ సందర్భంగా తమ బిడ్డ ప్రాణాలను కాపాడిన మహేశ్ బాబుకు శివాలి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. మహేశ్ బాబు మంచి మనసుపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.