Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్-పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్లు డీ కొననున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ కు కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. గాయం కారణంగా దూరమైన హార్థిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండనున్నాడు. అయితే ఇవాళ జరిగే ఈ కీలక మ్యాచ్ కు పంజాబ్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియం వేదిక అయింది. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ మరింత ఆసక్తిరేపుతుంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. శిఖర్ ధావన్ వర్సెస్ హార్థిక్ పాండ్యా మధ్య జరిగే ఈ ఉత్కంఠ భరిత పోరులో గెలుపు ఎవరిది అనేది చూడాల్సి ఉంది.