Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విశాఖపట్నం
మండలంలోని సబ్బవరం - చోడవరం రోడ్డులోని ఆరిపాక శివారు లగిశెట్టిపాలెం సమీపంలో బుధవారం అర్ధరాత్రి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటనలో బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీస్లు తెలిపిన వివరాల ప్రకారంం.. రోలుగుంట మండలంలోని అడ్డసార శివారు మర్రిపాలెం గ్రామానికి చెందిన కూరాకుల చిన్నబ్బాయి చిన్న కుమారుడు నాని(21)తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చిన అతడు బుధవారం రాత్రి బైక్పై తగరపువలసలోని కళాశాలకు తిరిగి వెళ్తున్నాడు.
ఈ తరుణంలో ఆరిపాక శివారు లగిశెట్టిపాలెం వద్ద బైక్ అదుపు తప్పడంతో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టాడు. తలకు హెల్మెట్ ఉన్నప్పటికీ బలంగా ఢీకోవడంతో హెల్మెట్ నుజ్జునుజ్జు అయి తలకు తీవ్రగాయాలయ్యాయి. దీనితో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో స్థానిక ఎస్ఐ వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.