Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కరీంనగర్
తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామ సచివాలయం ముందు మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత పది రోజుల నుంచి మంచినీళ్ల రావడం లేదని గ్రామ మహిళలు ఆందోళన చేపట్టారు. అయితే నాలుగు ఏళ్లుగా పలుమార్లు సంబంధిత శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు.
ఈ తరుణంలోనే నేడు ఉదయం మహిళలు బిందెలతో రోడుపై నిరసన తెలిపారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేయడం సరికాదని, తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తక్షణమే మంచినీటి సమస్యను పరిష్కరించకపోతే ఈ నిరసనను మండల స్థాయికి తీసుకెళ్తామని మహిళలు హెచ్చారించారు.