Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - లక్నో
యూపీలో ఇవాళ ఎన్కౌంటర్ జరిగింది. ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్‌ను పోలీసులు హతమార్చారు. అతని వద్ద నుంచి విదేశీ తయారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ ఝాన్సీ వద్ద జరిగింది. అసద్ అహ్మాద్, గులామ్ ఇద్దరిని పోలీసులు హతమార్చారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఓ మర్డర్ కేసులో ఇద్దరూ మోస్ట్ వాంటెడ్ నిందితులు. ఉమేశ్ పాల్ మర్డర్ కేసులో అసద్‌పై ఆరోపణలు ఉన్నాయి.
ఆ కేసులో అసద్‌పై 5 లక్షల రివార్డు కూడా ఉంది. యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇవాళ ఝాన్సీలో అతన్ని ఎన్కౌంటర్ చేశారు. సీటీఎఫ్ డిప్యూటీ ఎస్పీ నవేందు, డిప్యూటీ ఎస్పీ విమల్ నాయకత్వంలో ఆ ఎన్కౌంటర్ జరిగింది.