Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మే నెలలో కర్ణాటక అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే పార్లమెంటు ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ కర్ణాటకలో ప్రీపోల్ సర్వేను నిర్వహించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు గాను మెజార్టీకి అవసరమైన 113 సీట్లను ఏ పార్టీ కూడా గెలుచుకోలేదని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. కర్ణాటకలో మళ్లీ హంగ్ వస్తుందని వెల్లడయింది. జేడీఎస్ నేత కుమారస్వామి మరోసారి కింగ్ మేకర్ కానున్నారని తేలింది. ప్రాబబిలిటీ ప్రొఫెషనల్ మెథడాలజీ పద్ధతిలో ఈ సర్వేను నిర్వహించారు. మొత్తం 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే చేశారు. ప్రతి నియోజకర్గంలో ఐదు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేసి, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో 20 శాంపిల్స్ తీసుకున్నారు. మొత్తం 5,600 శాంపిల్స్ సేకరించడం జరిగింది. పురుషులు, స్త్రీలు, పేదలు, సంపన్నులు, కులం, వయస్సు, ప్రాంతం ఇలా అన్నీ తగు నిష్పత్తిలో ఉండేలా శాంపిల్స్ ను సేకరించి, అనలైజ్ చేశారు.