Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై మనం గట్టిగా పోరాడినందుకే కేంద్రం వెనక్కి తగ్గిందని మంత్రి కేటీఆర్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ విషయంలో తాము ముందుకు వెళ్లడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే వెల్లడించారు.
ఈ తరుణంలో ఈ ప్రకటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ తొలి విజయం సాధించిందని కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ పోరాటంతో కేంద్రం దిగివచ్చిందని అన్నారు. విశాఖ ఉక్కుపై గట్టిగా మాట్లాడిన ఘనత మన కేసీఆర్ అని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై మనం గట్టిగా పోరాడినందుకే కేంద్రం వెనక్కి తగ్గిందని అన్నారు. కేసీఆర్ దెబ్బ అలా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.