Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణలోని 194 ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 16న ప్రవేశ పరీక్ష జగరనుంది. ఈ తరుణంలో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఆరో తరగతిలో ప్రవేశానికి ఆదివారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, 7-10 తరగతుల్లో ప్రవేశానికి అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల కోసం జనవరి 10 నుంచి మార్చి 15వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 70,041 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. విద్యార్థులు తమ రిఫరెన్స్ ఐడీ/పేరు/మొబైల్ నంబర్‌తో పాటు పుట్టినతేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.