Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నిన్నటి వరకు ఎండలు దంచికొట్టిన హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం చల్లని వాతావరణం ఏర్పడింది. భాగ్యనగరాన్ని కారుమబ్బులు కమ్మేశాయి. సాయంత్రం 5.30గంటల సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. మొత్తంగా వర్షం కురియడంతో ఏర్పడిన చల్లదనంతో నగరవాసులు ఎంజాయ్ చేస్తున్నారు. వర్షం వల్ల పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం కలగడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.