Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
పదో తరగతి పరీక్షల ఫలితాలను మే రెండో వారంలో విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్టు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పదోతరగతి పరీక్షా కేంద్రాలను గురువారం ఆయన తనిఖీ చేశారు.
ఈ తరుణంలో దేవానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో 6.64లక్షల మంది విద్యార్థులు పది పరీక్షలు రాస్తున్నారన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. అంతే కాకుండా ఈనెల 18తో ‘పది’ పరీక్షలు ముగుస్తాయని 19 నుంచి 26వ తేదీ వరకు ఎనిమిది రోజుల పాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుందని తెలిపారు. ఇందులో 30 నుంచి 35 వేల మంది ఉపాధ్యాయులు పాల్గొంటారన్నారు. వాల్యుయేషన్ అనంతరం కార్యక్రమాలు పూర్తి చేసి మే రెండో వారంలో విద్యాశాఖ మంత్రి అనుమతితో పది ఫలితాలు విడుదల చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.