Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : స్టీల్ ప్లాంట్ పై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తప్పుబట్టారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. బీఆర్ఎస్ చెబితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ పై కేంద్రం వెనక్కి తగ్గిందా..? అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణపై కేసీఆర్ ఎప్పుడు మాట్లాడారని నిలదీశారు బొత్స సత్యనారాయణ. స్టీల్ ప్లాంట్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పష్టత ఉందని, ఎవరెన్ని కామెంట్లు చేసినా పట్టించుకోమని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభించిందని.. పూర్తిస్థాయిలో కేంద్రం తన నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు పోరాడతామని అన్నారు. తెలంగాణ మంత్రి హరీష్ రావు మాటలు చిన్నపిల్లల మాటలని కొట్టిపారేశారు. పక్క రాష్ట్రం గురించి మాట్లాడే హక్కు వాళ్ళకేం ఉందని నిలదీశారు. ఎవరి పరిధిలో వాళ్ళు మాట్లాడితే మంచిదని హెచ్చరించారు బొత్స.