Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ
ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ ను కర్నాటక ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దానిపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ తరుణంలో కర్నాటక ప్రభుత్వం తప్పుడు అభిప్రాయాలపై ఆ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.వొక్కలింగ, లింగాయత్‌లకు చెరో రెండు శాతం రిజర్వేషన్లు పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వొక్కలింగ, లింగాయత్‌లు రిజర్వేషన్ కల్పించడం పట్ల సుప్రీం విస్మయం వ్యక్తం చేసింది. ఈ కేసును మళ్లీ ఏప్రిల్ 18వ తేదీ విచారించనున్నట్లు తెలిపింది.