Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రేపు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ప్రాంతంలో ట్రాఫిక్ నిబంధనలు పెట్టారు. ఐమాక్స్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, సెక్రటేరియట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ దారి మళ్లించారు. అలాగే నెక్లెస్‌రోడ్, సెక్రటేరియట్, ఐమాక్స్ ప్రాంతాల్లోని హోటళ్లు మూసివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసుల సూచించారు.
అంబేద్కర్ జయంతి తరుణంలో ఏప్రిల్ 14న 125 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. నగరం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించేందుకు ప్రత్యేక హెలికాప్టర్లో విగ్రహావిష్కరణ సందర్భంగా పూలవర్షం కురిపిస్తారు.