Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
వరంగల్‌లో ఐపీఎల్ ఓ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు నగరంలో గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ తరుణంలో ఛత్తీస్గడ్, వరంగల్‌కు చెందిన గ్యాంగ్ ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో మొత్తం ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురిలో ఇద్దరు మహిళలు కూడా ఉండటం గమనార్హం. నిందితుల నుంచి 3 ల్యాప్ టాప్ లు, 13 సెల్ ఫోన్ లు, 1.9 లక్షల నగదు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా వివిధ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డులు, చెక్ బుక్‌లను సీజ్ చేశారు.