Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా ఇవాళ గుడివాడ వస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇలాకాలో చంద్రబాబు రోడ్ షో, సభలో పాల్గొననున్నారు. అయితే, గుడివాడలో కొడాలి నాని కార్యాలయం వద్ద ఈ సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. కొడాలి నాని కార్యాలయం వద్దకు వైసీపీ, టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఇరు పార్టీల వర్గీయులు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేస్తుండడంతో పరిస్థితి ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో, పోలీసు బలగాలను పెద్ద సంఖ్యలో గుడివాడకు తరలించారు. ఎవరూ కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఉన్నతాధికారులు పోలీసులను బృందాలుగా విభజించి రూట్లు నిర్దేశిస్తున్నారు.