Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సింగపూర్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి చివరి వారంలో కరోనా కేసుల సంఖ్య 28,000లు దాటింది. దీంతో మరో కోవిడ్ వేవ్‌పై ఆ దేశంలో ఆందోళన వ్యక్తమవుతున్నది. కాగా, ఎక్స్‌బీబీ సబ్‌వేరియంట్ వల్ల సింగపూర్‌లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా కేసుల్లో తేలికపాటి కరోనా లక్షణాలు ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఇన్ఫ్లుఎంజా వంటి ఇతర శ్వాసకోశ వ్యాధుల మాదిరిగానే ఎప్పటికప్పుడు కొత్త కోవిడ్ వేవ్‌లు వస్తుంటాయని పేర్కొంది. కరోనా వ్యాప్తి తగ్గిన నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలన్న నిబంధనను సింగపూర్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో సడలించింది.