Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హైదరాబాద్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ అత్యధికంగా 36 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ 25, శామ్ కరన్ 22, షారుఖ్ ఖాన్ 22, భానుక రాజపక్స 20 పరుగులు చేశారు. అంతకుముందు, ఓపెనర్లు ప్రభ్ సిమ్రన్ సింగ్ (0), శిఖర్ ధావన్ (8) స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో పంజాబ్ కింగ్స్ కు శుభారంభం లభించలేదు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మోహిత్ శర్మ 2, మహ్మద్ షమీ 1, జాషువా లిటిల్ 1, అల్జారీ జోసెఫ్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు.