Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 125 అడుగుల బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధమైంది. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌తో కలిసి సీఎం కేసీఆర్ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. బౌద్ధ భిక్షువుల ప్రార్థనలతో ఆవిష్కరణ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఆవిష్కరణ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెక్లె్‌సరోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అన్ని నియోజకవర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. సుమారుగా 750 ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఇప్పటికే అధికారులకు సీఎం సూచించారు. ప్రజలకు ఎండ వేడిమి తగలకుండా నెక్లెస్ రోడ్డులో భారీ షామియానాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 40 నుంచి 50 వేల మందికి సరిపడా ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు అందించేందుకు లక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు, లక్షన్నర నీళ్ల ప్యాకెట్లను సిద్ధం చేశారు. బస్సుల్లో వచ్చే జనానికి ఉదయం అల్పాహరం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేయనుంది.