Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - విజయవాడ: మార్గదర్శి చిట్‌ఫండ్ కేసులో చార్టెడ్ అకౌంటెంట్ అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీ ప్రొఫెషనల్ ఫోరం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న తొమ్మిది మంది ప్రతినిధులకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 2న విజయవాడలోని ఓ హోటల్లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఆ సమావేశంలో ప్రసంగించిన న్యాయవాదులు గొట్టిపాటి రామకృష్ణప్రసాద్, జడ శ్రావణ్‌కుమార్, సుంకర రాజేంద్రప్రసాద్, నేతి మహేశ్వరరావు, చార్టెడ్ అకౌంటెంట్లు జొన్నలగడ్డ శ్రీనివాసరావు, ముప్పాళ్ల సుబ్బారావు, శ్రీరామ్, ఏపీ జర్నలిస్టు ఫోరం ప్రతినిధి కృష్ణాంజనేయులు, ఆలిండియా ప్రోగ్రెసివ్ ఫోరం కార్యదర్శి పీవీ మల్లికార్జునరావు, ఉప్పులేటి దేవీశ్రీ ప్రసాద్‌లకు గురువారం సీఐడీ నోటీసులు అందజేసింది. శనివారం విజయవాడ సత్యనారాయణపురంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించారు. నోటీసులపై న్యాయవాదులు మండిపడుతున్నారు. సీఐడీ అధికారుల తీరుపై త్వరలో గవర్నర్‌ను కలుస్తామని చెప్పారు.