Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూయార్క్: ట్విట్టర్ సంస్థ ఓనర్ ఎలన్ మస్క్ తల్లి మేయి మస్క్‌ను గౌరవ డాక్టరేట్ వరించింది. సౌతాఫ్రికాలోని యూనివర్సిటీ ఆఫ్ ద ఫ్రీ స్టేట్ ఆమెకు ఆ డాక్టరేట్‌ను ఇచ్చింది. న్యూట్రిషన్ పరిశోధనలో ఆమె చేసిన స్టడీకి గాను ఈ డాక్టరేట్‌ను అందజేశారు. గౌరవ డాక్టరేట్ దక్కిన విషయాన్ని మేయి మస్క్ తన ట్విట్టర్లో వెల్లడించారు. డైయిటెటిక్స్ సబ్జెక్ట్‌లో తనకు డాక్టరేట్ వచ్చినట్లు ఆమె చెప్పారు. తన యవ్వనాన్ని న్యూట్రిషన్ రీసర్చ్ కోసం అంకితం చేశానని, డైటీషియన్లను ప్రమోట్ చేశానని, ఇది ఉత్తమైన గుర్తింపు అని డాక్టరేట్ అందుకున్న తర్వాత మేయి మస్క్ తెలిపారు.