Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాన - ఢిల్లీ: గత కొద్దిరోజులుగా దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా 2,21,725 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,109 మంది వైరస్ బారినపడ్డారని శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందురోజు కంటే 9 శాతం అధికంగా కేసులు వెలుగుచూశాయి. ఢిల్లీ, మహారాష్ట్రలో వ్యాప్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఢిల్లీలో 1,527, మహారాష్ట్రలో 1,086 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఈ పెరుగుదలతో క్రియాశీల కేసుల సంఖ్య 49,622(0.11శాతం)కి చేరింది. రికవరీ రేటు 98.70శాతంగా నమోదైంది. కొత్తగా కేంద్రం 20 మరణాలను ప్రకటించింది. తాజాగా ఉద్ధృతికి XBB.1.16 సబ్ వేరియంట్ కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదని, కొవిడ్ నియమావళిని పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.