Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
ఇండోనేషియాకు చెందిన ఓ సైబర్ నేరగాళ్ల ముఠా భారత్‌లోని ప్రభుత్వ వెబ్సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు కేంద్రం ముందుగానే గుర్తించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. దాదాపు 12 వేల వెబ్సైట్లను ఓ హ్యాకర్ల బృందం లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కూడా ఉన్నట్లు కేంద్ర హోంశాఖలోని ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఈ ముప్పును ముందుగానే పసిగట్టింది. దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ అధికారులకు సూచనలు జారీ చేసింది.
డినయల్ ఆఫ్ సర్వీస్’, డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ దాడుల ద్వారా వెబ్సైట్లను హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. వేర్వేరు వ్యక్తిగత కంప్యూటర్ల ద్వారా ఒకేసారి పెద్ద ఎత్తున సమాచారం వెబ్సైట్లలోకి చొప్పించడం ద్వారా ఈ సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ తరుణం అపరిచిత మెయిల్స్, లింకులను ఎట్టిపరిస్థితుల్లోనూ యాక్సెస్ చేయొద్దని హోంశాఖ అధికారులను హెచ్చరించింది. అన్ని సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించింది.