Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమెరికా: అమెరికా రక్షణశాఖకు సంబంధించిన అత్యంత కీలకమైన రహస్యాలను లీక్ చేసిన 21 ఏళ్ల యువకుడిని ఎఫ్ బిఐ అరెస్టు చేసింది. అమెరికా నిఘా పత్రాల లీక్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ డేటాతో కూడిన అమెరికా నిఘా సంస్థ రహస్య పత్రాలు గత వారం ఇంటర్నెట్లో లీక్ చేయబడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. ఆ పత్రాలు ఉక్రెయిన్‌లో యుద్ధానికి సంబంధించిన సున్నితమైన సైనిక సమాచారాన్ని వెల్లడించాయి. మిలిటరీ ఇంటెలిజెన్స్ పత్రాల లీక్ కేసులో 21 ఏళ్ల నిందితుడిని ఎఫ్బిఐ ఈ రోజు అరెస్టు చేసింది. నిందితుడు మస్సాచుసెట్స్‌కు చెందిన డగ్లస్ టీక్సీగా గుర్తించారు.