Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ 2023లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ ను ఢీ కొట్టబోతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కోల్ కతా నైట్ రైడర్స్ తో ఈడెన్ గెర్డెన్స్ వేదికగా ఎస్ ఆర్ హెచ్ నేడు తలపడనుంది. ఈ తరుణంలో ఎస్ ఆర్ హెచ్ పలు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తుంది. వరుసగా మూడు మ్యాచ్ ల్లో విఫలమయిన ఇంగ్లండ్ పవర్ హిట్టర్ హ్యారీ బ్యూక్ ను పక్కన పెట్టాలని ఎస్ ఆర్ హెచ్ టీమ్ మెనెజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా 13 కోట్లకు పైగా కొనుగోలు చేసిన బ్రూక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇక అతడి స్థానంలో న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ గ్లెన్ పిలిప్స్ టీమ్ లోకి వచ్చే అవకాశం ఉంది.
కోల్ కతా నైట్ రైడర్స్ : జాసన్ రాయ్, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా ( కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్థూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
సన్ రైజర్స్ హైదరాబాద్ : గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వా్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్ ( కెప్టెన్ ), హెన్రిచ్ క్లాసెస్ ( వికెట్ కీపర్ ), అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, టీ నటరాజన్.