Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పంజాగుట్ట చౌరస్తాలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ తరుణంలో జై భీమ్ జై కేసీఆర్ నినాదాలతో పంజాగుట్ట కూడలి మారుమోగింది.