Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహారాష్ట
ఛత్రపతి శంభాజీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. శివషాహి బస్సు ఘోర ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో ఛత్రపతి శంభాజీనగర్ పట్టణంలోని బాబా పెట్రోల్ పంపు వద్ద శివషాహి బస్సు ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్‌తో సహా 14 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఘాటి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ శివషాహి బస్సు నాసిక్ కి చెందినదిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.