Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఇటీవల అమెజాన్ సంస్థ 27వేల మందిని తొలగించేందుకు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ చేసిన లేఖలో ఆ సంస్థ సీఈవో ఆండీ జాసీ కొన్ని విషయాలు తెలిపారు. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా, సంస్థ అభివృద్ధి కోసం ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన చెప్పారు. గత నెల నుంచి అమెజాన్ సంస్థలో సెకండ్ లేఆఫ్ మొదలైంది. రెండో దఫాలో సుమారు 9 వేల మందిని తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయన షేర్హోల్డర్లకు లేఖ రాశారు. తొలి ఫేజ్‌లో 18 వేల జాబ్స్‌ను తొలగించిన విషయం తెలిసిందే.
ఇటీవల ఉద్యోగులకు రాసి లేఖలో సంస్థ నిర్ణయాన్ని స్వాగతించారు. దీర్ఘకాలం ఆలోచనతో కంపెనీ సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కంపెనీ గురించి లోతుగా ఆలోచించామని, ఒక్కొక్క బిజినెస్‌ను స్టడీ చేశామని, లాంగ్ టర్మ్‌లో రెవన్యూ జరేట్ చేస్తుందా లేదా అన్న ఆలోచనలతో నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. రానున్న రోజుల్లో కంపెనీకి మంచి జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఖర్చులను తగ్గించేందుకు అమెజాన్ కంపెనీకి చెందిన ఫిజకల్ స్టోర్స్‌ను మూసివేశామన్నారు. అమెజాన్ ఫ్యాబ్రిక్, అమెజాన్ కేర్ ఎఫర్ట్స్‌ను కూడా మూసివేసినట్లు చెప్పారు.