Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: శేరిలింగంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్లలో భార్యను భర్త అతికిరాతకంగా హతమార్చాడు. కుటుంబ కలహాల్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి పరిధిలోని నల్లగండ్ల ప్రాంతానికి చెందిన అంబిక (26), నరేందర్ భార్యాభర్తలు. విభేదాలతో గతకొంతకాలంగా అంబిక నల్లగండ్లలో, నరేందర్ తాండూరులో నివాసముంటున్నారు. ఈ తరుణంలో శుక్రవారం నల్లగండ్లకు వచ్చిన నరేందర్ భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన భర్త తొలుత రాయితో భార్య తలపై బాదాడు. గాయంతో అంబిక పరుగు తీయగా నరేందర్ ఆమె వెంటపడి మరీ కత్తితో గొంతుకోశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై శేరిలింగంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.