Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
దేశంలోని నేతలంతా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొంటూ ఉంటే ఏపీలోని పలు జిల్లాల్లో మంత్రులు మాత్రం ఈ కార్యక్రమానికి హజరుకాలేదు. ముఖ్యంగా చిత్తూరులోని అంబేద్కర్ భవనములో జిల్లా యంత్రాంగం నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి మంత్రులు హజరుకాకాపోవడం చర్చనీయాంశంగా మారింది. దర్గా సర్కిల్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆర్కే రోజా హాజరయ్యారు. అనంతరం అంబేద్కర్ భవనంలో జిల్లా యంత్రాంగం అధికారికంగా నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి వీరిద్దరూ హాజరు కాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.