Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ సంక్షోభానికి మోడీ ప్రభుత్వమే కారణం
- ఏజెన్సీలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను భయపెడుతున్నారు
- విజయవాడలో 'ప్రచార భేరి'లో పాల్గొన్న సీపీఐ(ఎం) పొలిట్ భ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్
నవతెలంగాణ-విజయవాడ : ప్రజా వ్యతిరేఖ నిరంకుశ మతోన్మాద బీజేపీ మోడీని సాగనంపుదాం..దేశాన్ని కాపాడుకుందాం అంటూ విజయవాడలో సీపీఐ(ఎం), సీపీఐ సంముక్తంగా 'ప్రచార భేరి' నిర్వహించారు. ఈ ప్రచారభేరీ సభలో సీపీఐ(ఎం ) పొలిట్ భ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్, సీపీఐ జాతీయ కార్యదర్మి బినయ్ విశ్వం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ కారత్ మాట్లాడుతూ ఇప్పుడు మన దేశాన్ని పాలిస్తున్న వారు స్వతంత్ర సంగ్రామంలో ఎన్నడూ పాల్గొనలేదన్నారు. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని పాత్యాత్త దోరణిలో కాకుండా మనుస్మృతి అనుసరించాలని చెప్పుకొచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరడలేదని, వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. నరేంద్ర మోడీ రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఆ రాజ్యాంగాన్ని వమ్ము చేసి హిందూ రాజ్యం ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు నోరు ఎత్తడానికి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీలను ఉపయోగించి ప్రతిపక్ష నాయకులను భయపెడుతున్నారని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందుత్వ సిద్ధాంతం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ముస్లింలు, మైనారిటీలపై లవ్ జిహాద్, గోహత్య అంటూ కొత్త చట్టాలు తెస్తూ కేసు పెడుతున్నారన్నారు. 2014లో ఆదాని ఆస్తి రూ.50 వేల కోట్ల నుంచి 2022 నాటికి రూ.10.50 లక్షల కోట్లకు చేరిందని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో అసమానతలు పెరిగిపోయాయన్నారు. సాధారణ ప్రజలు ఈ సమయంలో ధరల పెరుగుదల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులపై సంపద పన్ను, క్యాపిటల్ గేన్స్ టాక్స్, ఇతర టాక్స్లు వేయడం లేదని, దీనితో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. చిన్నతరహా పరిశ్రమలు ఉద్యోగాల కల్పన ఎక్కువగా చేస్తాయని, అయితే మోడీ వాటిని ప్రోత్సహించడం లేదని విమర్శించారు.
వ్యవసాయ సంక్షోభానికి మోడీ ప్రభుత్వమే కారణమన్నారు. 3 నల్ల చట్టాలు చేశారని, రైతులు సంవత్సరం పోరాటం చేసి తిప్పికొట్టారన్నారు. ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం ప్రస్తుతానికి పక్కన పెట్టామని చెపుతోందన్నారు. ఏపీలో బీజేపీ భాగస్వామ్యం లేని ప్రభుత్వం ఉందని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, కేరళలలో కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని, వైసీపీ దీనికి భిన్నంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో అన్ని ప్రజావ్యతిరేక బిల్లులకు మోడీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు ఇస్తోందన్నారు. బీజేపీ ఇక్కడ లేకపోయినా వాళ్ళ విధానాలను వైసీపీ అమలు చేస్తోందని ఆరోపించారు. హిందూ రాజ్యం ఏర్పడితే అది దేశానికే పెను ప్రమాదం అవుతుందని ప్రకాష్ కారత్ ఆందోళన వ్యక్తం చేశారు.