Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మహిళపై లైంగికదాడి ఆరోపణలపై జూబ్లీహిల్స్ పోలీసులు ఓ మ్యూజీషియన్ ను అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తి జూబ్లీహిల్స్‌కు చెందిన లలిత్ సెహగల్ (30)గా గుర్తించారు. అతను ఓ ప్రముఖ పబ్‌లో గిటారిస్ట్‌గా పనిచేస్తున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం లలిత్ సెహగల్, ఆ మహిళ గతంలో స్నేహితులుగా తెలుస్తోంది. పలు కారణంగా వల్ల వారద్దరి మధ్య దూరం పెరిగినట్టు సమాచారం.
ఈ క్రమంలో లలిత్ సెహగల్ ఆ మహిళ ఇంట్లోకి చొరబడి లైంగికదాడికి పాల్పడ్డాడు. అతడిని అడ్డుకున్న ఆ మహిళ అక్కడి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. దీంతో మహిళ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి సెహగల్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతన్ని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.