Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇకపై మనకు ఆకాశంలో నక్షత్రంగా మెరుస్తూ కనిపిస్తారు. బడుగు జీవుల కోసం అహర్నిశలు కృషి చేసిన ఆయన 132వ జయంతి సందర్భంగా.. ఆయన పేరును ఓ నక్షత్రానికి పెట్టారు. అంబేద్కర్ మహాపరినిర్వాణం (డిసెంబర్ 6, 1956) తర్వాత.. అతని అంత్యక్రియల ఊరేగింపులో అనేక ప్రకటనలు చేయబడ్డాయి. అందులో 'జబ్ తక్ సూరజ్ చంద్ రహేగా బాబా తేరా నామ్ రహేగా..!'( ఆ సూర్యచంద్రులు ఉన్నంతకాలం.. అంబేద్కర్ పేరు కూడా చిరస్థాయిగా నిలిచివుంటుంది) అంటూ కీర్తించారు. 67 ఏళ్లు పూర్తయిన తర్వాత ఇప్పుడు పాక్షికంగా అది కార్యరూపం దాల్చింది. ఛత్రపతి సంభాజీ నగర్‌లోని భీస్ సైనిక్ విభాగం.. ఓ నక్షత్రాన్ని కొని.. దానికి అంబేద్కర్ పేరు పెడుతూ.. రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసింది. సంభాజీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మున్సిపల్ స్టాండింగ్ కమిటీ మాజీ అధ్యక్షుడు రాజు షిండే అంతరిక్షంలో నక్షత్రాన్ని నమోదు చేశారు. బాబాసాహెబ్ 132వ జయంతి సందర్భంగా 'డా. బాబాసాహెబ్ అంబేద్కర్' స్టార్ లాంచ్ చేయబడుతుంది. ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు ఈ తారా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతరిక్షంలో నక్షత్రాలను నమోదు చేసే 'ఇంటర్నేషనల్ స్టార్ అండ్ స్పేస్ రిజిస్ట్రీ' అనే సంస్థ అమెరికాలో ఉంది. ఈ సంస్థ ద్వారా అంతరిక్షంలోని నక్షత్రాలకు వ్యక్తుల పేర్లను ఇస్తారు. ఫ్రాన్స్‌కు కూడా ఇలాంటి సంస్థ ఉంది. వంద డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో తొమ్మిది వేల రూపాయలు చెల్లించి నక్షత్రం నమోదు చేయబడుతుంది.