Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలం కానుగామాకులపల్లెలో ఓ కుటుంబం శుక్రవారం గృహప్రవేశానికి శ్రీకారం చుట్టింది. అయితే గృహ ప్రవేశ సమయంలో విద్యుత్ఘాతం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.