Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలతంగాణ - హైదరాబాద్
అంబేడ్కర్ ఆదర్శాలు పాటించడమే నిజమైన నివాళి అని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ తరుణంలో సభలో ప్రకాశ్ అంబేడ్కర్ మాట్లాడుతూ అంబేద్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు.
సమాజంలో మార్పుకోసం అంబేద్కర్ భావజాలం ఎంతో అవసరం అన్నారు. అంతే కాకుండా దళితబంధు పథకం రూపొందించిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. అంటరానితనాన్ని పారద్రోలడానికి అంబేడ్కర్ ఎంతో కృషి చేశారు. కొన్ని అతి చిన్న కులాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయి. చిన్న రాష్ట్రాల ప్రతిపాదనకు అంబేద్కర్ మద్దతిచ్చారు. దేశానికి రక్షణ సమస్య వస్తే మరో రాజధాని అవసరమని అంబేద్కర్ అన్నారని, రెండో రాజధానిగా హైదరాబాద్ సరైందని సూచించారు. పాక్ , చైనా నుంచి హైదరాబాద్ ఎంతో దూరంలో ఉంది’’ అని ప్రకాశ్ అంబేద్కర్ వివరించారు.