Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ లెవల్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల నిర్వహించిన ఎస్ఐ (సివిల్, ఐటీ అండ్ సీఓ, పీటీఓ) తత్సమాన పోస్టులు, ఏఎస్ఐ పోస్టులకు సంబంధించిన రాత పరీక్షల ఫలితాల 'కీ'ని శనివారం నుంచి www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8, 9 తేదీల్లో ఆర్థమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లిష్, జనరల్ స్టడీస్, తెలుగు, ఉర్దూ, రెండు నాన్ టెక్నికల్ పేపర్లకు సంబంధించిన పరీక్షలను మూడు జిల్లాల్లో 81 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని 15న ఉదయం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. వీటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి 17వ తేదీ వరకు వెబ్సైట్ ద్వారా స్వీకరించనున్నారు. అభ్యర్థులు తమ అభ్యంతరాలను డాక్యుమెంట్, పీడీఎఫ్, జేపీజీ రూపంలో వెబ్సైట్లో సమర్పించవచ్చు. అందుకు సంబంధించిన ప్రొఫార్మాను తమ వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచినట్లు బోర్డు చైర్మన్ పేర్కొన్నారు. ఫైనల్ కీని విడుదల చేసిన తర్వాత అభ్యర్థుల ఓఎమ్మార్ షీట్‌ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. మిగతా పేపర్లకు సంబంధించిన ప్రిలిమినరీ కీ వివరాలను ప్రెస్‌నోట్ ద్వారా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.