Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జమ్మూకశ్మీర్
ఉదమ్‌పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.. పాదచారుల వంతెన కుప్పకూలిన ఘటనలో 80 మందిగాయాలపాలయ్యారు. ఉధంపూర్‌లోని చెనాని బ్లాక్‌లోని బైన్ గ్రామంలోని బేని సంగమ్లో బైసాఖి వేడుకల సందర్భంగా పాదచారుల వంతెన కూలిపోయిందని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వినోద్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బైశాఖీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు పాదచారుల వంతెనపైకి ఒక్కసారిగా రావడంతో అది కుప్పకూలినట్లు డివిజినల్ కమిషనర్ రమేశ్ కుమార్ తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.