Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ నాచారంలోని అంబేద్కర్ నగర్ లో నాలా పొంగి పొర్లింది. నాలా నీళ్లు భారీగా ప్రవహిస్తుండటంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లకు ఇరువైపుల ఉన్న గల్లీలోని ఇళ్లల్లోకి మురికి నీరు భారీగా చేరింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఎక్కడిక్కడే గల్లీల్లో చిక్కుకుపోయారు. తమను, తమ పిల్లలను కాపాడుకోవడానికి కాలనీ వాసులు ప్రయత్నిస్తున్నారు. ఇళ్ళల్లోని వస్తువులు అన్నీ నీట మునగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన జీహెచ్ఎంసీ, డిఅర్ఎఫ్ సిబ్బంది అక్కడి నుండి జనాన్ని తరలిస్తున్నారు. మరో వైపు నాలా పనులు ఆలస్యంపై అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల నుండి నాలా పనులు జరుగుతున్నాయని ఏడాది లో పూర్తి చేస్తామని చెప్పినా..ఇప్పటికీ పనులు పూర్తి కాలేదంటూ మండిపడుతున్నారు. చిన్నా పాటి వర్షానికే నాలా పొంగిపొర్లితే భారీ వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.