Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఎట్టకేలకే శుక్రవారం(ఏప్రిల్ 14) కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బ్రూక్ 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 100 పరుగులతో అధ్బుత సెంచరీ చేశాడు. తనను విమర్శించిన వారికి బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 228 భారీ స్కోరును నమోదు చేశారు. దీంతో కోల్ కతాకు 229 భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ముందునుంచి మంచి దూకుడుగా ఆడిన హ్యారీ కోల్‌కతా బౌలర్లలపై ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు.హ్యారీకి ఇదే ఐపీఎల్ లో తొలి సెంచరీ కావడం విశేషం. ఇక మరో ఆటగాడు మార్క్రమ్ (50) హాఫ్ సెంచరీతో ఆదరగొట్టగా, చివర్లో అభిషేక్ శర్మ (32) దూకుడుగా ఆడటంతో సన్‌రైజర్స్ భారీ స్కోర్ చేసింది. కోల్‌కతా బౌలర్లలో రస్సెల్ 3, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీశాడు.