Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీవారి దర్శనం కోసం కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులకు తిరుపతి భూదేవి కాంప్లెక్స్‌లో దివ్యదర్శన టోకెన్ల జారీ శుక్రవారం ప్రారంభమైంది. వేకువజామున మూడు గంటలకు 8వేల దివ్య దర్శన టోకెన్లు విడుదల చేశారు. ఉదయం 8 గంటలకు అవి పూర్తి కాగా మిగిలిన భక్తులకు మరో 4వేలు విడతల వారీగా జారీ చేశారు. ఇక్కడ టోకెన్లు పొందిన భక్తులు గాలిగోపురం వద్ద ఉన్న కౌంటర్లో స్కానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.