Authorization
Mon April 28, 2025 10:24:53 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణెలోని పింపుల్ గురవ్ నుంచి గోరేగావ్ వెళ్తున్న బస్సు ఈ తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో పూణె-రాయగడ్ సరిహద్దులో ప్రమాదానికి గురైంది. అదుపు తప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. బస్సులో చిక్కున్న వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. రాయగడ్లోని ఖోపోలి ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు రాయగడ్ ఎస్పీ సోమనాథ్ ఘార్గ్ తెలిపారు.