Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సోషల్ మీడియాలో ద్వేషపూరిత పోస్టులు పెట్టిన బీజేపీ నేతలకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 8 మంది బీజేపీ నేతలు తమ ముందు హాజరు అయి సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన వాస్తవాలను సమర్పించాలని ఛత్తీస్‌గఢ్ పోలీసులు నోటీసుల్లో కోరారు. సోషల్ మీడియాలో ద్వేషపూరిత కంటెంట్‌ను పోస్ట్ చేశారనే ఆరోపణలపై కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోని 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. నోటీసులు అందుకున్న 8 మంది కార్యకర్తల్లో బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ శ్రీవాస్తవ, బీజేపీ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐటీ సెల్ ఇన్ఛార్జ్ సునీల్ పిళ్లై, కోశాధికారి నందన్ జైన్, బీజేపీ ట్రేడ్ సెల్ అధ్యక్షుడు కేదార్నాథ్ గుప్తా, బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు యోగి సాహు, డివిజనల్ యువమోర్చా కోఆర్డినేటర్ కమల్ శర్మ,బీజేపీ యువమోర్చా సభ్యుడు శుభంకర్, పార్టీ కార్యకర్త బిట్టు పాణిగ్రాహి ఉన్నారని రాయ్‌పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ అగర్వాల్ చెప్పారు. బీజేపీ నేతలు తమ సోషల్ మీడియా పోస్ట్‌లతో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొంటూ కాంగ్రెస్ ఏప్రిల్ 12న రాయ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలోని బెమెతర జిల్లాలోని బీరాన్‌పూర్‌లో జరిగిన మత హింసకు సంబంధించి బీజేపీ సభ్యుల పెట్టిన పోస్ట్‌లు ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను అవమానకరమైన పదాలను ఉపయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి.విద్వేషపూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవాలని గత ఏడాది అక్టోబర్ 21న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.