Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ సహకారంతో జీహెచ్ఎంసీ జవహర్‌నగర్‌లో లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. రూ.251 కోట్లతో నిర్మించిన ఈ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు.
2017లో ప్రారంభించిన మొబైల్ ఆర్వో సిస్టం ద్వారా రోజుకు 2 వేల కిలోల లీటర్ల సామర్థ్యంతో పాక్షిక శుద్ధి సౌకర్యాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత రోజుకు 4 వేల కిలోలీటర్లకు పెంచారు. దీంతో పాటు ఇప్పటికే వృథా నీటితో నిండిన మలారం చెరువులో దాదాపు 11.67 లక్షల కిలో లీటర్ల నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగించారు. అంతేకాకుండా ఈ చెరువులోని వృథా నీరు పొంగిపోకుండా దాదాపు 4 కోట్ల 35 లక్షలతో తుపాను నీటి మళ్లింపు నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది. జవహర్‌నగర్ డంప్‌యార్డు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి వల్ల కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేందుకు జీహెచ్ఎంసీ 2020 నాటికి క్యాపింగ్ పనులను పూర్తి చేసింది.